:::: తొలిపొద్దు ::::

నా రచన, కవిత , జీవితం
Subscribe

నా గురించి..

నా వీధి నాటిక ” రైతు ” సగటు రైతు ఆత్మ ఘోష గా ౨౦ (20) సంవత్సరాలుగా నన్ను గన్న తల్లి ప్రజానాట్యమండలి నిర్వహిస్తున్న సఫ్ధర్ హష్మి ఓపెన్ ధియేటర్ ( షాట్ ) వీధినాటకోత్సవాలలో ఒక విడదీయలేని భాగం. Shot 2009దాని లోంచి ఒక్క మాటను తీయలేదు , అదనంగా రాయలేదు.  గత పదిహేను సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాపితంగా దిగజారిపోతున్న రైతుకు నిలువెత్తు సంతకం గా ఆ నాటిక ప్రదర్శింప బడుతుంది. మరో వీధి నాటిక ” గొర్రెలు తిరగ బడతాయి ” వేల ప్రదర్శనల కు నోచుకుంది. నా వీధినాటికలు కొన్ని ఇద్దరు ప్రముఖుల పీ.హెచ్.డీ లలో చర్చకు , విశ్లేషణ కు ప్రేరణ అయ్యాయి.

నా లలిత గీతాలు అనేకం పలు వేదికల పై ఔత్సాహిక గాయకుల ఆర్తిని తీర్చి నాకు కూడా కొంత కీర్తిని సంపాదించి పెట్టాయి.

పాఠకులు మన్నించాలి . నా ఈ గోల ఈ సైటు తయారు చేసిన నా కొడుకు ” అలక ” తీర్చటాని కే .

నా అక్షరాలు మొత్తం నెట్లో పెట్టాలని వాడి ఆత్రుత. అప్పటికి వాడితో చెప్పాను , ఇంత వరకు ఒక చోటికి నా సాహిత్యం పోగు చెయ్యలేదు రా అని. వాడన్నాడు , ” రాయటం వరకే నీ పని , రాశాక అది పాఠకులకు అందుబాటులో ఉంచి తీరాలి . అందు కే పోగయ్యింది పోగయినట్టు పెడదాం “అని బలవంతం చేసి ఇది వ్రాయించాడు.

మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టి వుంటే మన్నించండి.

ప్రపంచంలో మనిషి చాలా జయించాడు. కాని భద్దకాన్ని జయించలేదు . ఆ జభ్భు నాకు కూడా వుంది.అయినా శ్రాయశక్తులా నా సాహిత్యం నెట్ లోకి ప్రవహించటానికి నా హ్రుదయపు లాకుల్ని ఎత్తి పట్టుకుని ఉండటానికి ప్రయత్నిస్తాను.

save

పేజీలు : 1 2 3