:::: తొలిపొద్దు ::::

నా రచన, కవిత , జీవితం
Subscribe

June, 2008యొక్క ఆర్కైవ్స్

ఇదంతా ఎంటి ?

June 27, 2008 By: దేవేంద్ర కొత్తూరు Category: కవిత్వం 1 Comment →

భాష అలుక్కు పోవటం

మాటల్లో పొంతన లేక పోవటం

హఠాత్తుగా ఆశక్తులన్నీ

అనాశక్తులవ్వటం

మోయలేని ఆనందమో – భాధో

మనల్ని మన నుండి వేరు చేసి

విసిరి పారేస్తీ …..

లోకం కొలతల్లో మన అభివ్యక్తి

ఇమడక పోవటం

ఇదంతా ఏంటి ?

ఇప్పటి దాక అనుభవించిన

సంవత్సరం

జ్నాపకాల దొంతరలోకి దొర్లిపోవటం

ఊరించే ఏదో నూత్న రుచి

అప్పుడప్పుడే మొలకలెత్తటం

ఇదంతా ఎంటి ?

చీకటి చింపిన వెలుతురు ముక్కలు

చినుకులై

కులుకులై

తళుకులై

మనల అభ్యంగన స్నానమాచరింప చేస్తే

సిగ్గు పడటం తెంపరి తనమే

ఇదంతా ఎంటి ?

అనుభవాలు ఆజ్నలై

అనుభూతులు అనూజ్నలై

అణూవణువు తెలియని అగ్నులై

దిగ్గున్న – భగ్గున

మనసులో ఎదో అలజడి

ఇదంతా ఎంటి ?

అసంతృప్తులు మలిజాములు

అశాంతులే అశనిపాతాలు

కన్నీటి జలపాతాలు

ఆక్రోశపు శరఘాతాలు

ఇది భాధా ?

ఐతే నొప్పి లేధే ?

ఇదంతా ఎంటి ?

కాలం కొంటె గా కన్ను గీటితే

భావాలు వాక్యాలై పెన్ను దాటితే

ఇలా తగలడింది

నూత్న వత్సర స్వాగతోన్మాదం

ఇదంతా ఎంటి ?

——

౩౧/౧౨/౨౦౦౭ రాత్రి ౧౧:౪౫

31/12/2007 11:45 PM

కాలం

June 26, 2008 By: దేవేంద్ర కొత్తూరు Category: కవిత్వం 1 Comment →

కాలం అంటే అంకెలా ?

కాలం అంటే పేర్లా ?

కాలం అంటే మానవ జీవితం నుండి

అనుభవాలను ఇచ్హే వేర్లు!

గుణపాఠాల ఆవిర్లు !!

కాలం భవిష్యత్తును పట్టే గాలం

బ్రమలు, వాస్తవాల మాయాజాలం

కాలం కవిత్వం – మానవత్వం

ఉనికి లో వున్న ప్రతి దానికి అస్తిత్వం వున్నట్లే

కాలానికి కొలతలు తప్పవు

కాలం మనిషికి కాపలా

పాపం దానికి విశ్రాంతి లేదు

ఎంత అలిసి పోయిందో

అంతు పొంతు లేని అనంత ప్రవాహానికి

ఆది అంతం లేదు

కాలం కౌగిట్లో ఆదమరచి

ఆది మరిచి

నగ్నం గా

ఆత్మ ప్రక్షాళన చేసుకోవటమే

తక్షన కర్తవ్యం

రండి తపిద్దాం !

రండి తరిద్దాం !!

౩౧/౧౨/౨౦౦౭ రాత్రి ౧౧:౩౦

31/12/2007  11:30 PM