:::: తొలిపొద్దు ::::

నా రచన, కవిత , జీవితం
Subscribe

September, 2008యొక్క ఆర్కైవ్స్

చినుకులెలిసిన రాత్రి

September 11, 2008 By: దేవేంద్ర కొత్తూరు Category: కవిత్వం, సాహిత్యం 3 Comments →

నదిలో మొలిచిన వెలుగు స్తంభాలు

అలల పరాచకానికి అలకలు పోతున్నాయి

చేపల చూపులకు ఈ పరాచకాలు ఉలికిపాటును చిలకరిస్తున్నాయి.

ఆకాశంలో నల్ల మబ్భులు చిక్కని రెల్లు దుబ్బులు అవుతున్నాయి

వాటి మద్య పిల్ల చుక్కలు తమ అందాల్ని నదిలో వెతుక్కుంటున్నాయి .

పాపం ఈ సరాగాలన్నింటిని పహారా కాస్తున్న కాలం

కన్నుమూస్తే ఎ మిన్ను విరుగుతుందో నని

రెప్ప వెయ్యటం మర్చి పొయ్యింది.

గాలి కవ్వింపు తో అలలు కలల్ని చెరిపేసుకుంటున్నాయి.

ఇన్ని అందాలకు నెలవు సౌందర్యలహరి “గోదారి ” కొలువు.

ఎక్కడా ?

ఇంకెక్కడా ?

భద్రాద్రి లో

చినుకులెలిసిన ఈ రాత్రి లో……

—————–

నిన్న రాత్రి ౧౦/౦౯/౨౦౦౮ ౧౦:౧౦ ని