:::: తొలిపొద్దు ::::

నా రచన, కవిత , జీవితం
Subscribe

January, 2009యొక్క ఆర్కైవ్స్

గబ్బిలం తపస్సు

January 19, 2009 By: దేవేంద్ర కొత్తూరు Category: కవిత్వం, సాహిత్యం No Comments →

మనుషుల మధ్య దగ్గర తనం

దూరం రెక్కలు విప్పుకుని

ఉద్దర దొరికిన గద్ద లాగ

ఎగిరిపోతోంది .

ఎంత ఎత్తున తానున్నా

కోడి పిల్లను చూసినట్టు

కనపడని లోతుల్లోని మనిషితనాన్ని

తన్నుకుపోటానికి వేగంగా దూసుకొస్తుంది.

అవకాశ వాద పరకాయ ప్రవేశం

ఏ లాభమైన

లోభమైన అంతిమంగా పొట్టకోసం తిప్పలేనా ?

అదే నిజమైతే

ఆకలి తీరాకైనా

సహజీవనం సాధ్యం కావాలి .

అంతరాల ఆంతర్యాలు

” అంతర్యామి “

కరుణాకటాక్షణాలను

వెతుక్కుంటూ

మాడ వీధుల్లో ఎంతబాగా ఊరేగుతున్నాయి .

వంచన శిల్పాలు చెక్కుకుంటూ

ఆత్మవంచన పంచలో

కంచలే

స్వేదాల పంటలను స్వాహా చేస్తున్నాయి

సంగీతం

అభిసారిక

దీర్ఘనిరీక్షణా చూపులా గా

సమ్మొహనా తూపుల్ని సంధిస్తోంది,

మనసును మరోవైపు మరలకుండా భందిస్తూ.

పట్టపగలుగా

వెలుగుల వాన కురుస్తున్నా ప్రాణం చుట్టూ అలుముకున్న చీకటి .

ఎద రోట్లో

ఒకటే రోకటి పోటు

ఇంకెక్కడ ఉంది విశ్రాంతికి చోటు.

పాపం శమించు గాక!

దేవుని సన్నిది లో ఏమిటి అప్రాచ్యపు ఉపాఖ్యానాలు

ఇది లీల ?

కాదు కాదు

గర్భగుడిలో తపస్సు చేస్తు

గబ్బిలం ఊళ .

————————-

౧౨/౦౧/౨౦౦౯(12/01/2009)

తిరుమల కొండ పై విపరీతమైన చలిలో (చిరువేడిని వెతుక్కుంటూ)