చినుకులెలిసిన రాత్రి

నదిలో మొలిచిన వెలుగు స్తంభాలు
అలల పరాచకానికి అలకలు పోతున్నాయి
చేపల చూపులకు ఈ పరాచకాలు ఉలికిపాటును చిలకరిస్తున్నాయి.
ఆకాశంలో నల్ల మబ్భులు చిక్కని రెల్లు దుబ్బులు అవుతున్నాయి
వాటి మద్య పిల్ల చుక్కలు తమ అందాల్ని నదిలో వెతుక్కుంటున్నాయి .
పాపం ఈ సరాగాలన్నింటిని పహారా కాస్తున్న కాలం
కన్నుమూస్తే ఎ మిన్ను విరుగుతుందో నని
రెప్ప వెయ్యటం మర్చి పొయ్యింది.
గాలి కవ్వింపు తో అలలు కలల్ని చెరిపేసుకుంటున్నాయి.
ఇన్ని అందాలకు నెలవు సౌందర్యలహరి “గోదారి ” కొలువు.
ఎక్కడా ?
ఇంకెక్కడా ?
భద్రాద్రి లో
చినుకులెలిసిన ఈ రాత్రి లో……
—————–
నిన్న రాత్రి ౧౦/౦౯/౨౦౦౮ ౧౦:౧౦ ని

Published on  July 7th, 2013