ఈ సంధి లో ఏంటీ రంది

ఆపేక్షలు ఆకాంక్షలు
పరీక్షలు సమీక్షలు
నిరీక్షలు ఉపేక్షలు
స్థల కాలాల మధ్య
పరస్పర శిక్షలు
ఆది – అంతాలు
అస్తిత్వ పరిష్వంగాలు
చలనాల సంచలనాలు
క్షణాలలో సాంద్రీకరించబడే
లక్షల పేజీల అనుభవాల దొంతరలు
పంతాలు పౌరుషాలు
తామస ఆకాశాన
బ్లాక్ హోల్ విన్యాశాలు
మత్సరాల ఉత్సవాలు
లెక్కతేల్చె సంవత్సరాలు
ఆకలి పొలి కేకల్లో
లక్షలాది మంది ముని మాపులు
నేల తో పెన వ్రేసుకున్న ప్రాణాలు
ఉరితాళ్ళ నిచ్చెనలెక్కి తీర్హుకునే వాయినాలు
మీడియా ఒడియాలు నంజుకుంటూ
యాసిడ్ తిరగమాతల్లో
ఎన్ కౌంటర్ విందుల్లో ఆధునిక శిక్షా సృతి
అవనీతల మెల్ల ఒకటే చర్చ
మనీ – మనిషి
ఒక దాని నుంచి ఒకటి
పరుచుకుంటున్న చీకటి
పాపం శ్రమ
అవుతోంది మూతపడే పరిశ్రమ
ఈ సంధి లో ఏంటీ రంది .

Published on  July 7th, 2013