ఇదంతా ఎంటి ?

భాష అలుక్కు పోవటం
మాటల్లో పొంతన లేక పోవటం
హఠాత్తుగా ఆశక్తులన్నీ
అనాశక్తులవ్వటం
మోయలేని ఆనందమో – భాధో
మనల్ని మన నుండి వేరు చేసి
విసిరి పారేస్తీ …..
లోకం కొలతల్లో మన అభివ్యక్తి
ఇమడక పోవటం
ఇదంతా ఏంటి ?
ఇప్పటి దాక అనుభవించిన
సంవత్సరం
జ్నాపకాల దొంతరలోకి దొర్లిపోవటం
ఊరించే ఏదో నూత్న రుచి
అప్పుడప్పుడే మొలకలెత్తటం
ఇదంతా ఎంటి ?
చీకటి చింపిన వెలుతురు ముక్కలు
చినుకులై
కులుకులై
తళుకులై
మనల అభ్యంగన స్నానమాచరింప చేస్తే
సిగ్గు పడటం తెంపరి తనమే
ఇదంతా ఎంటి ?
అనుభవాలు ఆజ్నలై
అనుభూతులు అనూజ్నలై
అణూవణువు తెలియని అగ్నులై
దిగ్గున్న – భగ్గున
మనసులో ఎదో అలజడి
ఇదంతా ఎంటి ?
అసంతృప్తులు మలిజాములు
అశాంతులే అశనిపాతాలు
కన్నీటి జలపాతాలు
ఆక్రోశపు శరఘాతాలు
ఇది భాధా ?
ఐతే నొప్పి లేధే ?
ఇదంతా ఎంటి ?
కాలం కొంటె గా కన్ను గీటితే
భావాలు వాక్యాలై పెన్ను దాటితే
ఇలా తగలడింది
నూత్న వత్సర స్వాగతోన్మాదం
ఇదంతా ఎంటి ?
——
౩౧/౧౨/౨౦౦౭ రాత్రి ౧౧:౪౫
31/12/2007 11:45 PM

Published on  August 23rd, 2019