కాలం

కాలం అంటే అంకెలా ?
కాలం అంటే పేర్లా ?
కాలం అంటే మానవ జీవితం నుండి
అనుభవాలను ఇచ్హే వేర్లు!
గుణపాఠాల ఆవిర్లు !!
కాలం భవిష్యత్తును పట్టే గాలం
బ్రమలు, వాస్తవాల మాయాజాలం
కాలం కవిత్వం – మానవత్వం
ఉనికి లో వున్న ప్రతి దానికి అస్తిత్వం వున్నట్లే
కాలానికి కొలతలు తప్పవు
కాలం మనిషికి కాపలా
పాపం దానికి విశ్రాంతి లేదు
ఎంత అలిసి పోయిందో
అంతు పొంతు లేని అనంత ప్రవాహానికి
ఆది అంతం లేదు
కాలం కౌగిట్లో ఆదమరచి
ఆది మరిచి
నగ్నం గా
ఆత్మ ప్రక్షాళన చేసుకోవటమే
తక్షన కర్తవ్యం
రండి తపిద్దాం !
రండి తరిద్దాం !!

౩౧/౧౨/౨౦౦౭ రాత్రి ౧౧:౩౦
31/12/2007  11:30 PM

Published on  July 7th, 2013