వాగ్దానం

మతోన్మాద మహమ్మారి కరాళ నృత్యం
ముంబయి కి చేసింది మరోసారి భీకర గాయం
వందల మంది ప్రాణాలను తీసి యెం సాధించావ్
రైలు పెట్టెలలో బాంబులు పేల్చి యెం బావుకున్నవ్..
కుటుంబాలు చిద్రమయ్యాయి పిల్లలు అనాధలయ్యారు
నీ లక్షం ఎంత సంకుచితమయింది
మైనార్టీ మతోన్మాదం జవాబు మెజార్టీ మతోన్మాదమా
మతోన్మాదం x మతోన్మాదం = మారణహోమం – పైశాచికత్వం
లక్షల మందిని బలి తీసుకున్న క్రూసేడ్స్ ( మత యుద్దాలు ) ను దాటి
మానవ పరిణామం పరిడమిల్లుతోంది
ఇక్కడ అక్కడ కాదు ప్రపంచమంతా మనిషితనం కోసం మంచితనం కోసం
ఆబగా యెదురు చూస్తున్న వేళ
ఎందుకు నీకీ ఉన్మాద తత్వం
మతం వ్యక్తిగతం
అతని విశ్వాసాలకి ఉద్వేగాలకి
వ్యక్తీకరణే మతం
మతం అంటే రాజకీయాలలో
ఓట్లను రాల్చుకునే మంత్ర దండం కాదు
భయం ప్రజల్ని కొద్దికాలం నిస్సహాయతలో ఉంచొచ్హు
గుజరాత్ లాగ ఒక్కోసారి ఎన్నికల విజయ్యాన్ని కూడా సాధించ వచ్హు.
ఒత్తిడికి లోనైన భయం విస్పోటిస్థే
యే అణువిలయం దానికి సాటి రాదు.
సంకుచిత రాజకీయ ప్రయోజనాల పై
సమైక్యంగా ప్రజలు దండోరా మ్రోగిస్తారు
మతోన్మాదాన్ని నిలువునా పాతి
దండన విధిస్తారు.
ఉద్రేకాలను రెచ్హగొట్టటం
పరమతాలని ద్వేషించటం
నిర్మూలించాలని ప్రచారం చేయటం
ఒరిస్సాలో జరిగిన కర్నాటక లో జరిగినా
గుజరాత్ మహారాష్త్ర ల లో జరిగినా
అది భారతీయతను హత్య చెయ్యటమే
మతోన్మాదం ౭౨ (72) గంటల పాటు
సృష్టించిన విబ్రమం
జాతి మోత్తాన్ని కుదిపేసింది.
ప్రాణాలను కోల్పోయిన వాళ్ళలో
ఏ మతం వాళ్ళు వున్నారని
తెలిసి మనకు కన్నీరు కారలేదు.
వాళ్లలో ఏ మతం వాళ్ళైనా ఉండొచ్హు
కాని
వారంతా భారతీయులు
అసమాన త్యాగాలను ప్రదర్సించిన
కమాండోలను ఎంపిక చెయ్యటం
మతప్రాతిపదికన జరగలేదు
ఒక దుర్మార్గ పైశాచిక దాడిని ఎదుర్కోవటానికి
దేశం మెత్తం సంసిద్దమైంది
ఇది అపూర్వం
ఓ మతోన్మాదమా
నీ తాకిడి తాత్కాలికంగా కలిగిస్తుంది
కొంచెం భయాన్ని మరో విషాద ఆనవాలును అంతే
నువ్వు దాడి చేసిన ప్రతిసారి
మాలో సామరస్యం పెరుగుతోంది
సహజీవన సమైక్య తత్వం
చివుళ్ళు వేస్తోంది.
మతోన్మాద లక్ష్యం
తెలియని వాళ్ళనుంచి జరిగిన దాడిని
పరస్పరం తెలిసిన వాళ్ళ మధ్యకు విస్తరించటం
ఇది ఒక రాజకీయ కుట్ర
మతం చుట్టూ సాగే
ఏ ప్రచారమైనా
ప్రజలను కలిపి ఉంచటానికి కాదు
ప్రజలను చీల్చటానికే..
శవాల గుట్టలను మెట్లగా మలుచుకుని
అందలాన్ని అధిరోహించటానికే
ఎప్పటికి ప్రజల్ని చీల్చాలనే కుట్రల్ని
బలి వాటికలు నెరవేర్చుకోలేవు
వాటికి తెలిసింది తీసిన ప్రాణాన్ని లెక్కించే కూడికలు
ఒకరి కన్నీరు ఒకరు తుడుచుకునే వేళ
ఒకరి హృదయాన్ని ఒకరు అనునయించే వేళ
మా గుండెల సవ్వడుల హెచ్హవేతలు
మాకు మాత్రమే తెలుసు
అది మతస్పర్స కాదు
మానవతా స్పర్స
అప్రమత్తంగా లేనందుకు
చెల్లించుకున్నాం మూల్యం
కేవలం బలిదానానికి ఇవ్వవలిసింది
నివాళి మాత్రమే కాదు
దేశ సమైక్యతను కాపాడే వాగ్దానం .
———————-
ముంబాయి పై దాడికి ప్రతిస్పందన…

Published on  July 7th, 2013