:::: తొలిపొద్దు ::::

నా రచన, కవిత , జీవితం
Subscribe

కష్టం ఎదురైతే

January 06, 2010 రచయిత: దేవేంద్ర కొత్తూరు సమూహం: కవిత్వం

కష్టం ఎదురైతే
దాన్ని అధికమించడానికి శ్రాయశక్తులా కృషి చెయ్య్
మళ్ళీ మళ్ళీ అధికమించడం కోసం ప్రయత్నించు.
ఆ కష్టం అనివార్యం అయినప్పుడు దాన్ని ఇష్టం గా మలుచుకో.
అది మాయమవుతుంది. అది చేసిన గాయం కూడా పోతుంది.

తెలుగు వెలుగు

January 03, 2010 రచయిత: దేవేంద్ర కొత్తూరు సమూహం: కవిత్వం, తొలిపొద్దు, పాటలు, వీధి నాటికలు, వ్యాసాలు, సాహిత్యం, స్వగతం

నా పై ఈ టీవీ ౨ లో కదనం

గబ్బిలం తపస్సు

January 19, 2009 రచయిత: దేవేంద్ర కొత్తూరు సమూహం: కవిత్వం, సాహిత్యం

మనుషుల మధ్య దగ్గర తనం

దూరం రెక్కలు విప్పుకుని

ఉద్దర దొరికిన గద్ద లాగ

ఎగిరిపోతోంది .

ఎంత ఎత్తున తానున్నా

కోడి పిల్లను చూసినట్టు

కనపడని లోతుల్లోని మనిషితనాన్ని

తన్నుకుపోటానికి వేగంగా దూసుకొస్తుంది.

అవకాశ వాద పరకాయ ప్రవేశం

ఏ లాభమైన

లోభమైన అంతిమంగా పొట్టకోసం తిప్పలేనా ?

అదే నిజమైతే

ఆకలి తీరాకైనా

సహజీవనం సాధ్యం కావాలి .

అంతరాల ఆంతర్యాలు

” అంతర్యామి “

కరుణాకటాక్షణాలను

వెతుక్కుంటూ

మాడ వీధుల్లో ఎంతబాగా ఊరేగుతున్నాయి .

వంచన శిల్పాలు చెక్కుకుంటూ

ఆత్మవంచన పంచలో

కంచలే

స్వేదాల పంటలను స్వాహా చేస్తున్నాయి

సంగీతం

అభిసారిక

దీర్ఘనిరీక్షణా చూపులా గా

సమ్మొహనా తూపుల్ని సంధిస్తోంది,

మనసును మరోవైపు మరలకుండా భందిస్తూ.

పట్టపగలుగా

వెలుగుల వాన కురుస్తున్నా ప్రాణం చుట్టూ అలుముకున్న చీకటి .

ఎద రోట్లో

ఒకటే రోకటి పోటు

ఇంకెక్కడ ఉంది విశ్రాంతికి చోటు.

పాపం శమించు గాక!

దేవుని సన్నిది లో ఏమిటి అప్రాచ్యపు ఉపాఖ్యానాలు

ఇది లీల ?

కాదు కాదు

గర్భగుడిలో తపస్సు చేస్తు

గబ్బిలం ఊళ .

————————-

౧౨/౦౧/౨౦౦౯(12/01/2009)

తిరుమల కొండ పై విపరీతమైన చలిలో (చిరువేడిని వెతుక్కుంటూ)

ఈ సంధి లో ఏంటీ రంది

December 31, 2008 రచయిత: దేవేంద్ర కొత్తూరు సమూహం: కవిత్వం, సాహిత్యం

ఆపేక్షలు ఆకాంక్షలు

పరీక్షలు సమీక్షలు

నిరీక్షలు ఉపేక్షలు

స్థల కాలాల మధ్య

పరస్పర శిక్షలు

ఆది – అంతాలు

అస్తిత్వ పరిష్వంగాలు

చలనాల సంచలనాలు

క్షణాలలో సాంద్రీకరించబడే

లక్షల పేజీల అనుభవాల దొంతరలు

పంతాలు పౌరుషాలు

తామస ఆకాశాన

బ్లాక్ హోల్ విన్యాశాలు

మత్సరాల ఉత్సవాలు

లెక్కతేల్చె సంవత్సరాలు

ఆకలి పొలి కేకల్లో

లక్షలాది మంది ముని మాపులు

నేల తో పెన వ్రేసుకున్న ప్రాణాలు

ఉరితాళ్ళ నిచ్చెనలెక్కి తీర్హుకునే వాయినాలు

మీడియా ఒడియాలు నంజుకుంటూ

యాసిడ్ తిరగమాతల్లో

ఎన్ కౌంటర్ విందుల్లో ఆధునిక శిక్షా సృతి

అవనీతల మెల్ల ఒకటే చర్చ

మనీ – మనిషి

ఒక దాని నుంచి ఒకటి

పరుచుకుంటున్న చీకటి

పాపం శ్రమ

అవుతోంది మూతపడే పరిశ్రమ

ఈ సంధి లో ఏంటీ రంది .

వాగ్దానం

December 04, 2008 రచయిత: దేవేంద్ర కొత్తూరు సమూహం: కవిత్వం, జాతీయం, సాహిత్యం

మతోన్మాద మహమ్మారి కరాళ నృత్యం

ముంబయి కి చేసింది మరోసారి భీకర గాయం

వందల మంది ప్రాణాలను తీసి యెం సాధించావ్

రైలు పెట్టెలలో బాంబులు పేల్చి యెం బావుకున్నవ్..

కుటుంబాలు చిద్రమయ్యాయి పిల్లలు అనాధలయ్యారు

నీ లక్షం ఎంత సంకుచితమయింది

మైనార్టీ మతోన్మాదం జవాబు మెజార్టీ మతోన్మాదమా

మతోన్మాదం x మతోన్మాదం = మారణహోమం – పైశాచికత్వం

లక్షల మందిని బలి తీసుకున్న క్రూసేడ్స్ ( మత యుద్దాలు ) ను దాటి

మానవ పరిణామం పరిడమిల్లుతోంది

ఇక్కడ అక్కడ కాదు ప్రపంచమంతా మనిషితనం కోసం మంచితనం కోసం

ఆబగా యెదురు చూస్తున్న వేళ

ఎందుకు నీకీ ఉన్మాద తత్వం

మతం వ్యక్తిగతం

అతని విశ్వాసాలకి ఉద్వేగాలకి

వ్యక్తీకరణే మతం

మతం అంటే రాజకీయాలలో

ఓట్లను రాల్చుకునే మంత్ర దండం కాదు

భయం ప్రజల్ని కొద్దికాలం నిస్సహాయతలో ఉంచొచ్హు

గుజరాత్ లాగ ఒక్కోసారి ఎన్నికల విజయ్యాన్ని కూడా సాధించ వచ్హు.

ఒత్తిడికి లోనైన భయం విస్పోటిస్థే

యే అణువిలయం దానికి సాటి రాదు.

సంకుచిత రాజకీయ ప్రయోజనాల పై

సమైక్యంగా ప్రజలు దండోరా మ్రోగిస్తారు

మతోన్మాదాన్ని నిలువునా పాతి

దండన విధిస్తారు.

ఉద్రేకాలను రెచ్హగొట్టటం

పరమతాలని ద్వేషించటం

నిర్మూలించాలని ప్రచారం చేయటం

ఒరిస్సాలో జరిగిన కర్నాటక లో జరిగినా

గుజరాత్ మహారాష్త్ర ల లో జరిగినా

అది భారతీయతను హత్య చెయ్యటమే

మతోన్మాదం ౭౨ (72) గంటల పాటు

సృష్టించిన విబ్రమం

జాతి మోత్తాన్ని కుదిపేసింది.

ప్రాణాలను కోల్పోయిన వాళ్ళలో

ఏ మతం వాళ్ళు వున్నారని

తెలిసి మనకు కన్నీరు కారలేదు.

వాళ్లలో ఏ మతం వాళ్ళైనా ఉండొచ్హు

కాని

వారంతా భారతీయులు

అసమాన త్యాగాలను ప్రదర్సించిన

కమాండోలను ఎంపిక చెయ్యటం

మతప్రాతిపదికన జరగలేదు

ఒక దుర్మార్గ పైశాచిక దాడిని ఎదుర్కోవటానికి

దేశం మెత్తం సంసిద్దమైంది

ఇది అపూర్వం

ఓ మతోన్మాదమా

నీ తాకిడి తాత్కాలికంగా కలిగిస్తుంది

కొంచెం భయాన్ని మరో విషాద ఆనవాలును అంతే

నువ్వు దాడి చేసిన ప్రతిసారి

మాలో సామరస్యం పెరుగుతోంది

సహజీవన సమైక్య తత్వం

చివుళ్ళు వేస్తోంది.

మతోన్మాద లక్ష్యం

తెలియని వాళ్ళనుంచి జరిగిన దాడిని

పరస్పరం తెలిసిన వాళ్ళ మధ్యకు విస్తరించటం

ఇది ఒక రాజకీయ కుట్ర

మతం చుట్టూ సాగే

ఏ ప్రచారమైనా

ప్రజలను కలిపి ఉంచటానికి కాదు

ప్రజలను చీల్చటానికే..

శవాల గుట్టలను మెట్లగా మలుచుకుని

అందలాన్ని అధిరోహించటానికే

ఎప్పటికి ప్రజల్ని చీల్చాలనే కుట్రల్ని

బలి వాటికలు నెరవేర్చుకోలేవు

వాటికి తెలిసింది తీసిన ప్రాణాన్ని లెక్కించే కూడికలు

ఒకరి కన్నీరు ఒకరు తుడుచుకునే వేళ

ఒకరి హృదయాన్ని ఒకరు అనునయించే వేళ

మా గుండెల సవ్వడుల హెచ్హవేతలు

మాకు మాత్రమే తెలుసు

అది మతస్పర్స కాదు

మానవతా స్పర్స

అప్రమత్తంగా లేనందుకు

చెల్లించుకున్నాం మూల్యం

కేవలం బలిదానానికి ఇవ్వవలిసింది

నివాళి మాత్రమే కాదు

దేశ సమైక్యతను కాపాడే వాగ్దానం .

———————-

ముంబాయి పై దాడికి ప్రతిస్పందన…

చినుకులెలిసిన రాత్రి

September 11, 2008 రచయిత: దేవేంద్ర కొత్తూరు సమూహం: కవిత్వం, సాహిత్యం

నదిలో మొలిచిన వెలుగు స్తంభాలు

అలల పరాచకానికి అలకలు పోతున్నాయి

చేపల చూపులకు ఈ పరాచకాలు ఉలికిపాటును చిలకరిస్తున్నాయి.

ఆకాశంలో నల్ల మబ్భులు చిక్కని రెల్లు దుబ్బులు అవుతున్నాయి

వాటి మద్య పిల్ల చుక్కలు తమ అందాల్ని నదిలో వెతుక్కుంటున్నాయి .

పాపం ఈ సరాగాలన్నింటిని పహారా కాస్తున్న కాలం

కన్నుమూస్తే ఎ మిన్ను విరుగుతుందో నని

రెప్ప వెయ్యటం మర్చి పొయ్యింది.

గాలి కవ్వింపు తో అలలు కలల్ని చెరిపేసుకుంటున్నాయి.

ఇన్ని అందాలకు నెలవు సౌందర్యలహరి “గోదారి ” కొలువు.

ఎక్కడా ?

ఇంకెక్కడా ?

భద్రాద్రి లో

చినుకులెలిసిన ఈ రాత్రి లో……

—————–

నిన్న రాత్రి ౧౦/౦౯/౨౦౦౮ ౧౦:౧౦ ని

ఇదంతా ఎంటి ?

June 27, 2008 రచయిత: దేవేంద్ర కొత్తూరు సమూహం: కవిత్వం

భాష అలుక్కు పోవటం

మాటల్లో పొంతన లేక పోవటం

హఠాత్తుగా ఆశక్తులన్నీ

అనాశక్తులవ్వటం

మోయలేని ఆనందమో – భాధో

మనల్ని మన నుండి వేరు చేసి

విసిరి పారేస్తీ …..

లోకం కొలతల్లో మన అభివ్యక్తి

ఇమడక పోవటం

ఇదంతా ఏంటి ?

ఇప్పటి దాక అనుభవించిన

సంవత్సరం

జ్నాపకాల దొంతరలోకి దొర్లిపోవటం

ఊరించే ఏదో నూత్న రుచి

అప్పుడప్పుడే మొలకలెత్తటం

ఇదంతా ఎంటి ?

చీకటి చింపిన వెలుతురు ముక్కలు

చినుకులై

కులుకులై

తళుకులై

మనల అభ్యంగన స్నానమాచరింప చేస్తే

సిగ్గు పడటం తెంపరి తనమే

ఇదంతా ఎంటి ?

అనుభవాలు ఆజ్నలై

అనుభూతులు అనూజ్నలై

అణూవణువు తెలియని అగ్నులై

దిగ్గున్న – భగ్గున

మనసులో ఎదో అలజడి

ఇదంతా ఎంటి ?

అసంతృప్తులు మలిజాములు

అశాంతులే అశనిపాతాలు

కన్నీటి జలపాతాలు

ఆక్రోశపు శరఘాతాలు

ఇది భాధా ?

ఐతే నొప్పి లేధే ?

ఇదంతా ఎంటి ?

కాలం కొంటె గా కన్ను గీటితే

భావాలు వాక్యాలై పెన్ను దాటితే

ఇలా తగలడింది

నూత్న వత్సర స్వాగతోన్మాదం

ఇదంతా ఎంటి ?

——

౩౧/౧౨/౨౦౦౭ రాత్రి ౧౧:౪౫

31/12/2007 11:45 PM

కాలం

June 26, 2008 రచయిత: దేవేంద్ర కొత్తూరు సమూహం: కవిత్వం

కాలం అంటే అంకెలా ?

కాలం అంటే పేర్లా ?

కాలం అంటే మానవ జీవితం నుండి

అనుభవాలను ఇచ్హే వేర్లు!

గుణపాఠాల ఆవిర్లు !!

కాలం భవిష్యత్తును పట్టే గాలం

బ్రమలు, వాస్తవాల మాయాజాలం

కాలం కవిత్వం – మానవత్వం

ఉనికి లో వున్న ప్రతి దానికి అస్తిత్వం వున్నట్లే

కాలానికి కొలతలు తప్పవు

కాలం మనిషికి కాపలా

పాపం దానికి విశ్రాంతి లేదు

ఎంత అలిసి పోయిందో

అంతు పొంతు లేని అనంత ప్రవాహానికి

ఆది అంతం లేదు

కాలం కౌగిట్లో ఆదమరచి

ఆది మరిచి

నగ్నం గా

ఆత్మ ప్రక్షాళన చేసుకోవటమే

తక్షన కర్తవ్యం

రండి తపిద్దాం !

రండి తరిద్దాం !!

౩౧/౧౨/౨౦౦౭ రాత్రి ౧౧:౩౦

31/12/2007  11:30 PM